Share News

ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు వీరే..

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:12 PM

కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్, నల్లగొండ, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. ఆయా కార్పొరేషన్లలో ఎన్నికైన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు వీరే..
Telangana Mayor Elections

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 16: తెలంగాణలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరుగగా, ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈరోజు (సోమవారం) మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్, నల్లగొండ, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. ఆయా కార్పొరేషన్లలో ఎన్నికైన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


కరీంనగర్ కార్పొరేషన్

కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది

  • మేయర్‌: కొలగాని శ్రీనివాస్ (బీజేపీ)

  • డిప్యూటీ మేయర్: వై.సునీల్ రావు (బీజేపీ)

నిజామాబాద్ కార్పొరేషన్

  • మేయర్: ఉమారాణి (కాంగ్రెస్)

  • డిప్యూటీ మేయర్: సల్మాతాహిన్ (ఏఐఎంఐఎం)

రామగుండం కార్పొరేషన్

  • మేయర్: మహంకాళి స్వామి (కాంగ్రెస్)

  • డిప్యూటీ మేయర్: పాతిపల్లి ఎల్లయ్య (కాంగ్రెస్)


political.jpg

నల్గొండ కార్పొరేషన్

  • మేయర్: ముర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్)

  • డిప్యూటీ మేయర్: మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్ (ఏఐఎంఐఎం)

మంచిర్యాల కార్పొరేషన్

  • మేయర్: ధరణి మధుకర్ (కాంగ్రెస్)

  • డిప్యూటీ మేయర్: సళ్ల రమ్య మహేశ్ (కాంగ్రెస్)

కొత్తగూడెం కార్పొరేషన్

  • మేయర్: మూడ్ గణేశ్ (సీపీఐ)

  • డిప్యూటీ మేయర్: సిరిపురపు లలిత కుమారీ (కాంగ్రెస్)

  • (మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఒప్పందం చేసుకున్న సీపీఐ, కాంగ్రెస్)

మహబూబ్‌నగర్ కార్పొరేషన్

  • మేయర్: గుమల్ మమత (కాంగ్రెస్)

  • డిప్యూటీ మేయర్: ఎం సురేందర్ రెడ్డి (కాంగ్రెస్)


ఇవి కూడా చదవండి..

తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తం..

బీఆర్‌ఎస్ తటస్థం.. బీజేపీదే కరీంనగర్ మేయర్ పీఠం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 03:19 PM