Share News

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..

ABN , Publish Date - Apr 12 , 2026 | 09:47 AM

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శివరాంపల్లి ప్రాంతంలోని ఓ గోదాంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..
Fire Accident

హైదరాబాద్‌: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సర్వారెడ్డి కాలనీ గ్రీన్ ప్రాంతంలో ఉన్న ఒక గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.


స్థానికుల సమాచారం ప్రకారం, ఆ గోదాంలో డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచారు. ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ వంటి వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే భారీగా వ్యాపించాయి. మంటలు తీవ్రరూపం దాల్చడంతో గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించాయి. పొగ దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి వెంటనే తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Also Read:

కేంద్రం కీలక నిర్ణయం.. రెండేళ్ల లోపు వారికి దగ్గు మందు వాడకంపై నిషేధం..

ఇంటి గోడలకు శుభసూచకాలు!

For More Latest News

Updated Date - Apr 12 , 2026 | 09:59 AM