Share News

కేంద్రం కీలక నిర్ణయం.. రెండేళ్ల లోపు వారికి దగ్గు మందు వాడకంపై నిషేధం..

ABN , Publish Date - Apr 12 , 2026 | 08:31 AM

చిన్న పిల్లల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. 'డ్రాఫ్ట్ నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా (NFI) 2026' ప్రతిపాదనల్లో భాగంగా.. రెండేళ్ల లోపు వయసున్న చిన్నారులకు దగ్గు, జలుబు సిరప్‌లను వాడకూడదని కఠిన నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. వివరాల్లోకి వెళితే..

కేంద్రం కీలక నిర్ణయం.. రెండేళ్ల లోపు వారికి దగ్గు మందు వాడకంపై నిషేధం..
India cough syrup ban,

న్యూఢిల్లీ: దేశంలోని చిన్న పిల్లల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. 'డ్రాఫ్ట్ నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా (NFI) 2026' ప్రతిపాదనల్లో భాగంగా.. రెండేళ్ల లోపు వయసున్న చిన్నారులకు దగ్గు, జలుబు సిరప్‌లను వాడకూడదని కఠిన నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 2025లో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కలుషిత దగ్గు మందుల కారణంగా ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు సిఫార్స్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మందులు ఇవ్వాల్సి వస్తే.. అర్హులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాలని చెబుతున్నారు. దగ్గు మందుల్లో ఉండే కొన్ని రసాయనాలు.. ఐదేళ్ల లోపు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండేళ్ల లోపు పిల్లల దగ్గుకు ఆవిరి పట్టడం, గోరు వెచ్చని నీరు, లిక్విడ్ ఆహారం ఇవాలని చెబుతున్నారు. ఈ డ్రాఫ్ట్ నిబంధనలు త్వరలో దేశ వ్యాప్తంగా అధికారికంగా అమలు కానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీనిపై అడ్వైజరీలు జారీ చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి

పెరుగుతున్న పసిడి ధరలు.. స్థిరంగా వెండి!

నాన్న నేర్పిన ఆ క్రమశిక్షణే నేను ఇప్పటికీ పాటిస్తున్నా..

Updated Date - Apr 12 , 2026 | 09:01 AM