Share News

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏటీఎం చోరీ.. ఇంకా దొరకని ఆచూకీ..

ABN , Publish Date - Apr 12 , 2026 | 08:27 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోరీకి గురైన ఏటీఎం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.. వివరాల్లోకి వెళితే..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏటీఎం చోరీ.. ఇంకా దొరకని ఆచూకీ..

సిరిసిల్ల, ఏప్రిల్ 12: ఎల్లారెడ్డిపేటలో చోరీ చేసిన ఎస్‌బీఐ ఏటీఎం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ ఏటీఎం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శని, ఆదివారాలు వరుసగా సెలవులు రావడంతో.. దొంగలు స్కెచ్ వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చోరీ జరిగిన సమయంలో ఏటీఎంలో ఎంత నగదు ఉందనే అంశంపై బ్యాంకు అధికారులు ఆరా తీస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్‌బీఐ ఏటీఎంలోకి దుండగులు శుక్రవారం అర్థరాత్రి చొరబడ్డారు.


ఏకంగా ఏటీఎం మెషిన్‌ను పెకిలించి, వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. వెంటనే డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. సీసీ టీవీ పుటేజ్‌ల ద్వారా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైద్యుల నియామకాల్లో వెయిటింగ్‌ జాబితా

ప్రారంభానికి సిద్ధమైన 3 ఎత్తిపోతల పథకాలు

For More TG News And Telugu News

Updated Date - Apr 12 , 2026 | 08:56 AM