స్వగ్రామానికి చేరిన మావోయిస్టు రూపి మృతదేహం.. మరికాసేపట్లో అంత్యక్రియలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 08:01 AM
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు భాగ్య అలియాస్ రూపి మృతదేహం ఆమె స్వగ్రామం ధర్మారం చేరుకుంది.
సిద్దిపేట, ఏప్రిల్15: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు భాగ్య అలియాస్ రూపి మృతదేహం ఆమె స్వగ్రామం ధర్మారం చేరుకుంది. మరికాసేపట్లో ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. సోమవారం కాంకేర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ నిర్వహించాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఇరు వైపులా హోరాహోరీగా కాల్పులు జరిగాయి.
ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎల్ఓసీ కమాండర్ రూపిరెడ్డి అలియాస్ రంగబోయిన భాగ్య (46) మరణించారు. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఆమె ఉన్నారు రూపిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. రూపి మృతదేహానికి ఛత్తీస్‌గఢ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.
ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం ఆపరేషన్ కగార్ తెరపైకి తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పలు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా భారీగా మావోయిస్టులు మృతి చెందారు. ప్రభుత్వం ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. భారీగా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన పుత్తడి.. తగ్గిన వెండి ధరలు
For More Telangana News And Telugu News