ఏసీబీకి చిక్కిన జీపీవో
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:08 AM
మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దపేట గ్రామపంచాయతీ పరిపాలన అధికారి(జీపీవో) దుర్గా ప్రసాద్ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.
భీమిని, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దపేట గ్రామపంచాయతీ పరిపాలన అధికారి(జీపీవో) దుర్గా ప్రసాద్ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపేట గ్రామానికి చెందిన ఫక్కీర్ మహమ్మద్ పెద్దపేట శివారులో 29 గుంటల భూమికి సంబంధించి సాదాబైనామా పత్రాల ద్వారా పట్టాదార్ పాస్‌బుక్ జారీ చేసేందుకు జీపీవో దుర్గా ప్రసాద్ రూ. లక్షా 30 వేలు డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో జీపీవో దుర్గా ప్రసాద్, మధ్యవర్తి పోతురాజుల రాజేందర్ ఫిర్యాదుదారుడి వద్దకు మంగళవారం చేరుకున్నారు. అనుకున్న ప్రకారం రూ. 80 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్ షాప్‌ల బంద్
ఎంబీబీఎస్ మేనేజ్‌మెంట్ కోటా భర్తీకి నోటిఫికేషన్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News