వారిద్దరిపై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం.. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్
ABN , Publish Date - Aug 25 , 2026 | 06:19 PM
మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిపై పూర్తి అంశాలతో నివేదికను పొందుపరిచి టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌కు అందజేశామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 25: మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిపై పూర్తి అంశాలతో నివేదికను పొందుపరిచి టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌కు అందజేశామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. దీనిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు పంపారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వీరిపై మీడియాలో వచ్చిన కథనాలను చూసి ఓ అంచనాకు వచ్చామని పేర్కొన్నారు.
అలాగే గత విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని వివరించారు. ఈ నివేదికను ఏఐసీసీ చీఫ్, పార్టీ జనరల్ సెక్రటరీకి కూడా పంపిస్తారని అన్నారు. కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాల మేరకు వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో నాయకులు, క్యాడర్‌కు ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నామని మల్లు రవి తెలిపారు.
అయితే ఆ నివేదికలో ఏముందో చెప్పే తనకు నోటీసులు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కమిటీలో క్రమశిక్షణ ప్రధానమైనదని పేర్కొన్నారు. క్రమశిక్షణపైనే పార్టీ గౌరవం ఆధారపడి ఉంటుందన్నారు. ఆ గౌరవం ఉంటేనే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. పార్టీపై నెగెటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా.. వీడియో వైరల్
చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్
For More TG News And Telugu News