ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 25 , 2026 | 04:25 PM
క్రికెట్ బాల్, టెన్నిస్ బాల్.. చిన్నగా.. బరువు తక్కువగా ఉంటాయి. కానీ ఫుట్‌బాల్ బరువుగా ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ బాల్, టెన్నిస్ బాల్.. చిన్నగా.. బరువు తక్కువగా ఉంటాయి. కానీ ఫుట్‌బాల్ బరువుగా ఉంటుంది. దానితో ఆడాలంటే.. చిన్న పిల్లలకు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కానీ ఓ బాలుడు ఫుట్‌బాల్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ బాలుడు చేతులు వెనక్కి కట్టుకుని.. ఫుట్‌బాల్ ఆడాడు. పేనిన కొన్ని కలువపూల మొక్కలతో రెండు చేతులను వెనక్కి పెట్టి కట్టాడు. నేల మీద ఉన్న ఫుట్‌బాల్‌ను కాలితో పైకి లేపాడు. ఆ తర్వాత తన మోకాళ్లతో ఫుట్‌బాల్‌ను పైకి లేపి.. ఆడాడు. అలాగే తలతో ఆ బాల్‌ను పైకి కొట్టాడు.
అలా ఫుట్‌బాల్‌ను ఎక్కడా కింద పడకుండా చాలా నేర్పుగా ఆడాడు. ఇంత చిన్న వయసులో ఈ ఆటను ఎక్కడో తర్ఫీదు పొందినట్లుగా అతడు ఆటకు అంతా ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను alamin181124 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ వీడియోను చాలా మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ బాలుడు భవిష్యత్ క్రీడాకారుడని అభివర్ణిస్తున్నారు. ఇది అతడి నిజమైన ప్రతిభకు గొప్ప ఉదాహరణ అని పేర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్
మా ఇంటి రెంటు, మెయింటెనెన్స్ ఖర్చే రూ.60 వేలు.. మహిళ పోస్టు వైరల్
For More Viral News And Telugu News