కూకట్‌పల్లి లులు హైపర్ మార్కెట్లో అధికారుల తనిఖీలు.. 150 కిలోల ఆహార పదార్థాల సీజ్
ABN , Publish Date - May 19 , 2026 | 12:30 PM
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లులు హైపర్ మార్కెట్‌లో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యానికి హాని కలిగించేలా ఉన్న 150 కిలోల ఆహార పదార్థాలను వారు స్వాదీనం చేసుకున్నారు.
హైదరాబాద్, మే 19: నగరంలో కూకట్‌పల్లిలోని లులు హైపర్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా ఉన్న దాదాపు 150 కిలోల ఆహార పదార్థాలను వారు సీజ్ చేశారు. మంగళవారం ఈ హైపర్ మార్కెట్‌లో తనిఖీలు చేపట్టిన అధికారులకు.. పలు ఆహార పదార్థాల్లో పురుగులు ఉండటాన్ని గుర్తించారు. అలాగే నాసిరకం ఆహార పదార్థాలు నిల్వ చేసినట్లు కనుగొన్నారు.
కిచెన్ అపరిశుభ్రంగా ఉండడాన్ని అధికారులు గుర్తించారు. పాడై పోయిన కూరగాయలతోపాటు పరిసర ప్రాంతాలలో పురుగులు సంచరిస్తున్నట్లు ఈ తనిఖీల్లో అధికారులు గమనించారు. గడువు సమీపించిన ఆహార పదార్థాలపై తప్పుదారి పట్టించే విధంగా లేబుళ్లు అతికించినట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్‌తో ప్యాక్‌డ్ ఫుడ్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ హైపర్ మార్కెట్ నుంచి బయటకు వెళ్లే డ్రైనేజ్ కూడా మాంసాహార వ్యర్థాలతో మూసుకుపోయినట్లు ఈ తనిఖీల్లో తేలింది. కల్తీ, అధిక కృత్రిమ రంగుల అనుమానంతో పలు ఆహార పదార్థాల నమూనాలను కూడా అధికారులు సేకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నకిలీ మద్యం కేసులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసిన అధికారులు
వీధి కుక్కలు.. ప్రజల ప్రాణాల భద్రతా అంశంగా పరిగణించండి: సుప్రీంకోర్టు
For TG News And Telugu News