Share News

నకిలీ మద్యం కేసులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసిన అధికారులు

ABN , Publish Date - May 19 , 2026 | 09:34 AM

నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టులో తుది చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 1,300 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జిషీట్‌లో 25 మందిపై అభియోగాలు మోపారు.

నకిలీ మద్యం కేసులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసిన అధికారులు

విజయవాడ,మే19: నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టులో తుది చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 1,300 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జిషీట్‌లో 25 మందిపై అభియోగాలు మోపారు. అలాగే 89 మందిని సాక్షులుగా చేర్చినట్లు సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏ1 జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాలు నిర్వహించినట్లు సిట్ గుర్తించింది.


వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ సహకారంతోనే అతడు ఈ కల్తీ మద్యం తయారు చేసినట్లు ఛార్జిషీట్‌లో సిట్ స్పష్టం చేసింది. అలాగే కల్తీ మద్యం తయారు చేయడం ద్వారా జనార్దన్ రావుతో పాటు జోగి రమేష్ లబ్ది పొందినట్లు అందులో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురి వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సిట్ సమర్పించింది.


ఇవి కూడా చదవండి..

ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం.. లోటస్‏పాండ్‌

అమెరికా కుట్రకు ఇమ్రాన్‌ ఖాన్‌ బలి..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 19 , 2026 | 09:41 AM