Share News

అమెరికా కుట్రకు ఇమ్రాన్‌ ఖాన్‌ బలి..!

ABN , Publish Date - May 19 , 2026 | 04:21 AM

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌... అమెరికా కుట్రకు బలైనట్టు తెలిపే రహస్య పత్రం ఒకటి బయటపడింది. ఇమ్రాన్‌ను గద్దె దించడం వెనుక అగ్రరాజ్యం పాత్ర ఉంది అనేలా అత్యంత రహస్య దౌత్య పత్రం తాజాగా లీక్‌ అయింది.

అమెరికా కుట్రకు ఇమ్రాన్‌ ఖాన్‌ బలి..!

  • రహస్య దౌత్య పత్రం బయటపెట్టిన ‘డ్రాప్‌ సైట్‌’

న్యూఢిల్లీ, మే 18: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌... అమెరికా కుట్రకు బలైనట్టు తెలిపే రహస్య పత్రం ఒకటి బయటపడింది. ఇమ్రాన్‌ను గద్దె దించడం వెనుక అగ్రరాజ్యం పాత్ర ఉంది అనేలా అత్యంత రహస్య దౌత్య పత్రం తాజాగా లీక్‌ అయింది. అమెరికాకు చెందిన ‘డ్రాస్‌ సైట్‌’ పరిశోధనాత్మక వార్తా సంస్థ ‘సైఫర్‌’ అనే రహస్య దౌత్య పత్రాన్ని బయటపెట్టింది. ‘కేబుల్‌ ఐ-0678’గా గుర్తించిన ఈ రహస్య పత్రం.. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడానికి ముందు వాషింగ్టన్‌లోని అప్పటి పాకిస్థాన్‌ రాయబారి అసద్‌ మజీద్‌ ఖాన్‌, అమెరికా విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి డొనాల్డ్‌ లూ మధ్య కీలక సమావేశం జరిగినట్టు వెల్లడించింది. ఆ సమావేశంలో వారు ఇమ్రాన్‌ ఖాన్‌ను పదవి నుంచి దించేసి జైల్లో పెట్టాలని, అప్పుడే పాకిస్థాన్‌-అమెరికా బంధం బలపడుతుందని చర్చించుకున్నట్టు తెలిసింది. తాను స్వతంత్య్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడం, రష్యా, చైనాకు వ్యతిరేకంగా ఉన్న అమెరికాతో ఏకీభవించకపోవడం వల్లే తనను పదవి నుంచి తొలగించడానికి అగ్రరాజ్యం కుట్ర చేసిందని అప్పట్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పదేపదే ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ వంటి పార్టీలు విదేశీ శక్తులతో కలిసి పనిచేస్తున్నాయని కూడా ఇమ్రాన్‌ ఆరోపించారు. డ్రాప్‌సైట్‌ సంస్థ ఈ రహస్య పత్రాన్ని లీక్‌ చేయడంతో.. నాలుగేళ్లుగా పాక్‌ రాజకీయాలను కుదిపేస్తున్న విదేశీ ఒత్తిడి ఆరోపణలకు బలమైన సాక్ష్యం దొరికినట్టు ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పీటీఐ, దాని మద్దతుదారులు భావిస్తున్నారు.

Updated Date - May 19 , 2026 | 04:21 AM