జీవన్‌రెడ్డి నివాసానికి కేటీఆర్.. ముహూర్తం ఫిక్స్
ABN , Publish Date - Apr 08 , 2026 | 09:09 PM
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు గురువారం మధ్యాహ్నం జగిత్యాలకు కేటీఆర్ చేరుకోనున్నారు.
జగిత్యాల, ఏప్రిల్08: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు గురువారం మధ్యాహ్నం జగిత్యాలకు కేటీఆర్ చేరుకోనున్నారు. గురువారం మధ్యాహ్నం 2.00 గంటలకు జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్తారు. ఈ సందర్భంగా ఆయనతో కేటీఆర్ సమావేశం అవుతారు. బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డిని కేటీఆర్ ఆహ్వానిస్తారు. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.
సీనియర్ నాయకుడినైన తనను అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తుందని జీవన్ రెడ్డి పలుమార్లు ఆరోపించారు. అంతేకాకుండా.. జగిత్యాలలో తనపై గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. ఈ సమయంలో జీవన్ రెడ్డిని సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులు పక్కన పెట్టారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ వర్గానికి చెందిన అభ్యర్థికి చైర్మన్ పదవి కట్టబెట్టారు.
జీవన్ రెడ్డి వర్గానికి చెందిన నేతకు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కేటాయించారు. అలాగే పార్టీలో సీనియర్ అయిన తనకు పీసీసీ పదవి కూడా కేటాయించకపోవడం పట్ల జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఆయన ఆ పార్టీ వీడారు. అయితే జగిత్యాల ప్రాంతాల్లో జీవన్ రెడ్డి బలమైన నేతగా కొనసాగుతున్నారు. ఆయన్ని పార్టీలోకి తీసుకోవడం ద్వారా జిల్లాలో మళ్లీ పార్టీకి పుర్వ వైభవం వస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఈ వార్తలు చదవండి..
విభిన్న వాతావరణ పరిస్థితులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: విపత్తు నిర్వహణ సంస్థ
తప్పులు చేసే గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు: మంత్రి నాదెండ్ల
For More TG News And Telugu News