Share News

ఇందిరమ్మ రాజ్యం.. భూరాక్షసుల స్వర్ణయుగం: కేటీఆర్

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:51 PM

కాంగ్రెస్ హయాంలోని ఇందిరమ్మ రాజ్యం.. భూ రాక్షసులకు స్వర్ణయుగమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో భూములను స్వాహా చేస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు.

ఇందిరమ్మ రాజ్యం.. భూరాక్షసుల స్వర్ణయుగం: కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 11: కేసీఆర్ పాలనలో ప్రజల సంపద పెరిగితే.. ఇందిరమ్మ రాజ్యంలో సామాన్యుల ఆస్తులు కాంగ్రెస్ కబంధహస్తాల్లో చిక్కుకున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గాంధీల పాలనలో గజానికో గజదొంగ తయారయ్యారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి భూ దోపిడీకి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.


బీఆర్ఎస్ హయాంలో16 లక్షల ఎకరాలు మాత్రమే 22A కింద నిషేధిత జాబితాలో ఉంటే.. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కోటి16 లక్షల ఎకరాలకు చేరుకున్నాయని కేటీఆర్ వెల్లడించారు. భూముల వివాదంతోనే మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు.


సీఎం రేవంత్ ఫ్యూచర్ సిటీతో భూదందాకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. కొంగర్ కలాన్‌లోని 100 ఎకరాలపై కూడా సీఎం కన్నుపడిందని ఆయన దుయ్యబట్టారు. ఇవి చాలదన్నట్లు మూసీ సుందరీకరణ పేరు చెప్పి వేలకోట్ల స్కామ్‌కు సీఎం తెరలేపుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వరంగల్‌ మార్కెట్లో మక్కలకు రికార్డు ధర

మెట్రో టేకోవర్‌ కోసం రుణాల వేట

Read Latest AP News And Telangana New

Updated Date - Sep 11 , 2026 | 01:35 PM