ఏపీ జల దోపిడీకి సర్కారు సహకారం
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:04 AM
నాగార్జున సాగర్ జలాల తరలింపు వ్యవహారంలో తెలంగాణ ప్రయోజనాలను సీఎం రేవంత్‌రెడ్డి ఏపీకి తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
చంద్రబాబు, మోదీ ప్రసన్నం కోసం సీఎం యత్నం: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారు. అనుమతుల్లేకుండా తెలంగాణ నీటి హక్కులను దెబ్బతీసేలా ఏపీ సర్కార్ నిర్మాణాలు చేపడితే సోయిలేకుండా ఉన్నారు. నాగార్జున సాగర్ డెడ్‌స్టోరేజీ జలాలను ఏపీ అక్రమంగా తరలిస్తుంటే.. కాపాడాల్సిన ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి ఏపీ జల దోపిడీకి సహకరిస్తున్నారు’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగర్‌వద్ద ఏడాదిగా సొరంగం తవ్వుతూ, విజయపురి సౌత్ వద్ద 510 అడుగుల దిగువన నీటిని తరలించేందుకు నిర్మాణాలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే ఈ వ్యవహారం జరుగుతోందని, తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టుపెట్టి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రంలో మోదీని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాగునీటి పథకం పేరుతో 1,650 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మించి 9 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పేరుకు తాగునీటి పథకమైనప్పటికీ, దాని ముసుగులో సాగునీటిని కూడా తరలించేందుకు కుట్ర జరుగుతోందన్నారు..
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
బాబా బర్త్‌డే స్పెషల్.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
Read Latest Telangana News And Telugu News