నియంతృత్వానికి దారితీసేలా డీలిమిటేషన్ బిల్లు
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:55 AM
డీలిమిటేషన్ బిల్లు ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని సమాఖ్యవాదం నుంచి ఏకీకృత విధానం దిశగా తీసుకెళ్తోందని, ఇది నియంతృత్వానికి దారి తీస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు.
కూనంనేని సాంబశివరావు ఆందోళన
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్ బిల్లు ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని సమాఖ్యవాదం నుంచి ఏకీకృత విధానం దిశగా తీసుకెళ్తోందని, ఇది నియంతృత్వానికి దారి తీస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్లో వీగిపోయిన బిల్లుకు, ప్రస్తుత బిల్లుకు తేడా లేదని, కొత్తసీసాలో పాత సారాలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
నాడు జనాభా ప్రాతిపదికన బిల్లును తెచ్చారని, తాజాగా రాష్ర్టాల వారీగా 50 శాతం సీట్లు పెంచుతామన్నారని ఆయన గుర్తు చేశారు. బిల్లుతో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరగనుందన్నారు. ఏప్రిల్లో బిల్లును వ్యతిరేకించిన పార్టీలు నేడు మద్దతు ప్రకటించటం వెనుక వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాలే కారణంగా కనపడుతున్నాయని కూనంనేని చెప్పారు. అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు బీజేపీ ప్రభుత్వం డీఎంకేను తాయిలాలిచ్చి తమ వైపునకు తిప్పుకుందని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Read Latest Telangana News And Telugu News