Share News

కొండగట్టు చందనోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:58 AM

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి 20 వరకు నిర్వహిస్తున్న చందనోత్సవం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలకు హాజరుకావాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాకు ఆహ్వానం అందింది.

కొండగట్టు చందనోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం
Kondagattu Chandanotsavam

  • ఎమ్మెల్యే సత్యం ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేత

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి 20 వరకు నిర్వహిస్తున్న చందనోత్సవం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలకు హాజరుకావాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాకు ఆహ్వానం అందింది.


చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు తదితరులు మంగళవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందచేశారు. 60 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహోత్సవాల విశిష్టత, ఆలయ చరిత్ర, స్థలపురాణం గురించి వివరించారు.

గవర్నర్‌ను కలిసిన సౌమ్యమిశ్రా

మహిళా భద్రత, షీటీమ్స్‌, భరోసా కేంద్రాల విభాగం డీజీపీగా నియమితులైన సౌమ్యమిశ్రా మంగళవారం గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళల భద్రత కోసం చేపడుతున్న చర్యలను వివరించారు. ఇటీవల జైళ్ల శాఖ నుంచి మహిళా భద్రత విభాగానికి బదిలీ అయిన నేపథ్యంలో ఆమె గవర్నర్‌ను కలిసినట్లు లోక్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 18 , 2026 | 05:00 AM