నార్త్ - సౌత్ యుద్ధం అంటూ విషం చిమ్ముతున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:15 AM
మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, ఏప్రిల్ 17: మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విపక్షాలు రాజకీయ దురుద్దేశంతో, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును అడ్డుకోవాలనే తప్పుడు ఆలోచనతో ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ అపోహలు సృష్టించడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం వారి రాజకీయ ప్రయోజనాల కోసమేనని ధ్వజమెత్తారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దక్షిణ భారతదేశానికి న్యాయం చెయ్యడమే మోదీ ఫార్ములా. న్యాయమా, అన్యాయమా అనే దానిపై చర్చకు సిద్ధమా? అసదుద్దీన్ హైబ్రిడ్ ఫార్ములా ఇది, రేవంత్ రెడ్డి ఫార్ములా కాదు. మజ్లిస్ పార్టీ మహిళ రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఈ పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను కలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీకి లొంగిపోయి పనిచేస్తోంది. 360 మంది తెలంగాణ ఉద్యమకారులను అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపింది. తెలంగాణ చివరి దశ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ ఎంపీలే కారం పొట్లాలు, పెప్పర్ స్ప్రేలు కొట్టారు. తెలంగాణ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య చేసిన తన వ్యాఖ్యలు తప్పు అయ్యాయని ఒప్పుకున్నారు. మహిళ రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు బిల్లును అడ్డుకునేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దక్షిణాది రాష్ట్రాలకు నరేంద్ర మోదీ న్యాయం చేస్తున్నారు’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చైత్ర అమావాస్య.. ఈ రాశుల వారు ఇలా చేస్తే..
For More AP News And Telugu News