ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై టీజీ సీఎస్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 11 , 2026 | 07:13 PM
తెలంగాణ వేదికగా జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్- 2026లో పాల్గొనే క్రీడాకారులు, కోచ్‌లు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణ వేదికగా జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్- 2026లో పాల్గొనే క్రీడాకారులు, కోచ్‌లు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఈ యూత్స్ గేమ్స్ నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఈ గేమ్స్‌కు దాదాపు 7 వేల మంది క్రీడాకారులు హాజరవుతారని వెల్లడించారు.
క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.120 కోట్లు కేటాయించినట్లు తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు వివరించారు. ఇప్పటికే 11 స్టేడియాలు సిద్ధం చేశామని తెలిపారు. మరో 5 స్టేడియాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి క్రీడా వేదికకు అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రతి క్రీడా వేదిక వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాగునీరు, పారిశుద్ధ్యం, టాయిలెట్ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు మరో 5 జిల్లాలు.. హన్మకొండ, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో ఈ ఖేలో ఇండియా పోటీలు నిర్వహిస్తున్నామని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా తెరకెక్కిస్తా: జగ్గారెడ్డి
భారత మాజీ ఉప రాష్ట్రపతికి అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స
For More TG News And Telugu News