Share News

ఖైరతాబాద్‌కు ఉపఎన్నికలు పెట్టండి

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:02 AM

పార్టీ ఫిరాయింపు కారణంగా దానం నాగేందర్‌ పదవి కోల్పోయినందున ఖైరతాబాద్‌లో తక్షణమే ఉపఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీజేపీ నేత, అక్కడ పోటీచేసి ఓడిన చింతల రామచంద్రారెడ్డి హైకోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు.

ఖైరతాబాద్‌కు ఉపఎన్నికలు పెట్టండి
Telangana High Court

  • దానం అనర్హతతో విజయారెడ్డి పిటిషన్‌కు కాలంచెల్లు

  • హైకోర్టులో చింతల రామచంద్రారెడ్డి దరఖాస్తు

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపు కారణంగా దానం నాగేందర్‌ పదవి కోల్పోయినందున ఖైరతాబాద్‌లో తక్షణమే ఉపఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీజేపీ నేత, అక్కడ పోటీచేసి ఓడిన చింతల రామచంద్రారెడ్డి హైకోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఖైరతాబాద్‌లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ నేత విజయారెడ్డి 2024 దాఖలు చేసిన ఎలక్షన్‌ పిటిషన్‌ (ఈపీ)లో భాగంగా ప్రస్తుత దరఖాస్తును సమర్పించారు.


ఈ అప్లికేషన్‌పై శుక్రవారం జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. చింతల రామచంద్రారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ దానం నాగేందర్‌ ఎమ్మెల్యే పదవిని కోల్పోయినందున విజయారెడ్డి దాఖలు చేసిన ఎలక్షన్‌ పిటిషన్‌కు కాలంచెల్లిపోయిందని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో ఎంతో మంది పోటీ చేయగా, తననే ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆమె కోరడం సరికాదని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అప్లికేషన్‌పై వివరణ ఇవ్వాలంటూ విజయారెడ్డికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 4కు వాయిదా వేసింది.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 05:02 AM