కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు భేటీ.. ఏం చర్చిస్తున్నారంటే..?
ABN , Publish Date - May 03 , 2026 | 07:12 PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న వారిద్దరూ ఆయనతో సమావేశమయ్యారు.
సిద్దిపేట: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న వారిద్దరూ ఆయనతో సమావేశమయ్యారు. ఈనెల 6న వరంగల్‌లో రైతు సభ నేపథ్యంలో వీరి తాజా భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. సభలో ప్రసంగించాల్సిన పలు అంశాలపై ముగ్గురు నేతలూ చర్చిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ధాన్యం కొనుగోళ్లలో వైఫల్యం, రైతులు పడుతున్న ఇబ్బందులపై రైతు సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వరంగల్ సభ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జిల్లాల వారీగా కలెక్టరేట్ల ముట్టడి, రహదారుల దిగ్బంధం అంశాలపై బీఆర్ఎస్ అగ్ర నేతలు కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఏయే అంశాలపై చర్చించారనే దానిపై మరింత స్పష్టత రానుంది.
ఈ వార్తలు కూడా చదవండి
బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి