సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - May 03 , 2026 | 05:48 PM
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగు రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
సిద్దిపేట, మే 03: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగు రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు.. ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు .
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి.. ఆ నలుగురిదే బాధ్యత: భానుప్రకాశ్ రెడ్డి
నేటితో ముగియనున్న ద్వారకాతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు
For More TG News And Telugu News