ఎలివేటెడ్ కారిడార్‌తో రూ.1,200 కోట్లు ఆదా
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:36 AM
కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లలో వంతెనలు, అండర్‌పా్‌సల రద్దు.. ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ఖర్చు పోనూ మొత్తం రూ.1,200 కోట్ల ప్రజాధనం ఆదా అవుతోందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే సక్సె్‌స్‌తో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల రద్దు..
ప్రతిపాదిత మార్గాన్ని పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లలో వంతెనలు, అండర్‌పా్‌సల రద్దు.. ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ఖర్చు పోనూ మొత్తం రూ.1,200 కోట్ల ప్రజాధనం ఆదా అవుతోందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సోమవారం జూబ్లీ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం, పంజాగుట్ట మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదిత మార్గాలను పరిశీలించారు. అనంతరం కర్ణన్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం విజయవంతం కావడంతో ప్రారంభించిన ప్రాజెక్టులను పునఃసమీక్షించి రద్దు చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట ఎన్‌ఎ్‌ఫసీఎల్ జంక్షన్ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ చౌరస్తా వరకు 4.3 కిలోమీటర్ల మేర రూ.1090 కోట్లతో ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచ్చిందన్నారు. ఎలివేటెడ్ కారిడార్‌తో ప్రధాన మార్గంలోని 5 జంక్షన్లలో సిగ్నల్ చిక్కులు లేకుండా ప్రయాణించే అవకాశముంటుందని పేర్కొన్నారు.
ఆ ఫౌండేషన్లపైనే ఎలివేటెడ్ కారిడార్..!
కేబీఆర్ పార్కు చుట్టూ వంతెనలు, అండర్‌పా్‌సల రద్దు నిర్ణయంతో ఇప్పటివరకు జరిగిన పనుల కోసం చేసిన ఖర్చు వృథానేనా..? అంటే జీహెచ్‌ఎంసీ వర్గాలు లేదని సమాధానమిస్తున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదిత మార్గంలో జరిగిన పనులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా స్ట్రక్చరల్ డిజైన్ రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు. మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ ఆస్పత్రి చౌరస్తాల వద్ద అండర్‌పాస్ నిర్మాణం కొన్ని మీటర్ల మేర తవ్వారు. కేబీఆర్ పార్కు ప్రవేశ ద్వారం వద్ద ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రి వైపు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు వెళ్లే మార్గంలో మొత్తం 16 ఫౌండేషన్లు నిర్మించారు. అయితే వీటిని నూతన కారిడార్ కోసం వినియోగించేలా అదనపు స్టీల్ చేర్చడం, అవసరాన్ని బట్టి వెడల్పు పెంపు (జాకెటింగ్) వంటివి చేయనున్నట్టు ఇంజనీరింగ్ అధికారి ఒకరు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
రూ.7,635 కోట్ల ట్రూ-అప్ గండం
ఏసీబీ వలలో ఇద్దరు మహిళా అధికారులు
సచివాలయంలో తాగు నీటికి తిప్పలు!
Read Latest Telangana News And Telugu News