Share News

వచ్చే ఏడాది గిన్నిస్‌ రికార్డు సాధించేలా బతుకమ్మ

ABN , Publish Date - Sep 28 , 2026 | 07:23 AM

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వాలు గిన్నిస్‌ రికార్డు కోసం వేడుకలు నిర్వహించినా సఫలం కాలేదని... వచ్చే ఏడాది ఈ రికార్డ్‌ సాధించడమే ధ్యేయంగా సంబురాలు నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.

వచ్చే ఏడాది గిన్నిస్‌ రికార్డు సాధించేలా బతుకమ్మ
Kalvakuntla Kavitha

  • ఈసారి 33 జిల్లాల్లో... విదేశాల్లో వేడుకలు: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వాలు గిన్నిస్‌ రికార్డు కోసం వేడుకలు నిర్వహించినా సఫలం కాలేదని... వచ్చే ఏడాది ఈ రికార్డ్‌ సాధించడమే ధ్యేయంగా సంబురాలు నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జాగృతి రూపొందించిన బతుకమ్మ పాటల సీడీ, సంబురాల పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.


ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో, విదేశాల్లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలోని మహిళలంతా పాల్గొనాలని, సాంప్రదాయ బతుకమ్మ పాటలను భావితరాలకు అందించేందుకే చప్పట్ల పాటలతో సీడీ రూపొందించామని కవిత పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది రెండున్నర లక్షలమందితో బతుకమ్మ ఔన్నత్యాన్ని చాటేలా వేడుకలు నిర్వహిస్తామని.. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో బతుకమ్మ, కోలాటం కమిటీలు వేస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తెలంగాణ సాధనకు బాపూ జీవితం అంకితం

‘అమ్మకు అక్షరమాల’పై వయోజన మహిళల ఆసక్తి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 07:23 AM