Share News

హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:23 AM

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ వినోద్‌కుమార్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ప్రమాణస్వీకారం
Justice Vinod Kumar

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ వినోద్‌కుమార్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం మొదటి కోర్టు హాల్‌లో నిర్వహించిన ఫుల్‌ కోర్టు సమావేశంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శాంకోషీ ఆయనతో ప్రమాణం చేయించారు. గత ఏడాది మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్‌ వినోద్‌కుమార్‌ మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.


ఈ ఏడాది నవంబర్‌ 16న ఆయన రిటైర్‌ కానున్న నేపథ్యంలో ఆయనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ వినోద్‌కుమార్‌ను హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యాక్షులు సురేందర్‌రెడ్డి, డీఎల్‌ పాండు, ఇతర కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం జస్టిస్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ బార్‌ అండ్‌ బెంచ్‌ మధ్య సత్సబంధాలు ఉన్నప్పుడే న్యాయ వ్యవస్థ పటిష్ఠంగా పని చేస్తుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అధిక లాభాల పేరుతో మోసం

గోవా డ్రగ్‌ పెడ్లర్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో వెయ్యిమంది తెలుగోళ్లు !

‘మై ఫాదర్‌ బాలయ్య’ రచయిత.. వైబీ సత్యనారాయణ కన్నుమూత

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 06:23 AM