Share News

కూకట్‌పల్లి జేఎన్టీయూలో ఘర్షణ.. అదుపులో 8 మంది విద్యార్థులు: డీసీపీ

ABN , Publish Date - Sep 04 , 2026 | 01:50 PM

కూకట్‌పల్లి జేఎన్టీయూ హాస్టల్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

కూకట్‌పల్లి జేఎన్టీయూలో ఘర్షణ.. అదుపులో 8 మంది విద్యార్థులు: డీసీపీ
kukatpally DCP Ritiraj

హైదరాబాద్, సెప్టెంబర్ 04: కూకట్‌పల్లి జేఎన్టీయూ హాస్టల్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. శుక్రవారం కూకట్‌పల్లిలో డీసీపీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. గురువారం జేఎన్టీయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందన్నారు.


ఈ నేపథ్యంలో డయల్ 100కి ఫోన్ చేస్తే.. పోలీసులు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని అన్నారు. మళ్లీ అర్ధరాత్రి 2:30కి రెండు వర్గాల విద్యార్థులు ఘర్షణకు దిగారని వివరించారు. దాంతో ఓ విద్యార్థికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. తొలుత ఓ అమ్మాయికి సమస్య వస్తే.. ఆమె తన స్నేహితుడికి ఫిర్యాదు చేసిందని తెలిపారు.


ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న సమయంలో గొడవ పెరిగి గ్రూప్ తగాదాగా మారిందని డీసీపీ రితిరాజ్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై కాలేజీ ప్రిన్సిపాల్, వార్డెన్‌తో మాట్లాడతామని అన్నారు. అయితే ఓ విద్యార్థి మద్యం మత్తులో ఉన్నాడని గుర్తు చేశారు. అతడు మద్యం బయట తాగి వచ్చాడా?.. లేకుంటే హాస్టల్‌ లోపల తాగాడా? అనే దానిపై ఆరా తీస్తున్నామని కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కూటమి పాలనపై ప్రజలకు వివరించడంలో మైలురాయి సాధించిన టీడీపీ: మంత్రి నారా లోకేశ్

భగవద్గీతను అందించిన జగద్గురువు.. శ్రీకృష్ణుడు: సీఎం చంద్రబాబు

For More TG News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 02:04 PM