Share News

27 మంది విద్యార్థులపై బహిష్కరణ వేటు!

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:08 AM

గత నెల (సెప్టెంబరు) 3, 4 తేదీల్లో జేఎన్‌టీయూ క్యాంప్‌సలోని మంజీరా, గౌతమి హాస్టళ్లలో జరిగిన రణరంగంపై యూనివర్సిటీ యాజమాన్యం కఠినమైన నిర్ణయాలకు ఉపక్రమించింది.

27 మంది  విద్యార్థులపై బహిష్కరణ వేటు!
JNTU Hyderabad Campus

  • జేఎన్‌టీయూలో రణరంగంపై విచారణ కమిటీ సిఫారసు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : గత నెల (సెప్టెంబరు) 3, 4 తేదీల్లో జేఎన్‌టీయూ క్యాంప్‌సలోని మంజీరా, గౌతమి హాస్టళ్లలో జరిగిన రణరంగంపై యూనివర్సిటీ యాజమాన్యం కఠినమైన నిర్ణయాలకు ఉపక్రమించింది. సుమారు 40 రోజుల పాటు విచారణ చేపట్టిన కమిటీ తాజాగా 27 మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసింది. కమిటీ అందజేసిన నివేదిక మేరకు వీరిలో కొందరిని ఆరు నెలల పాటు హాస్టళ్ల నుంచి, మరికొందరిని 8 నెలల పాటు కళాశాల నుంచి బహిష్కరించాలని ప్రిన్సిపాల్‌ నిర్ణయించారు.


ఈ మేరకు సంబంధిత హాస్టళ్ల వార్డెన్లకు, వివిధ విభాగాల అధిపతులకు బుధవారం సర్క్యులర్‌ జారీ చేశారు. సెప్టెంబరు 3న క్యాంప్‌సలో నిర్వహించిన తీజ్‌ వేడుకల సందర్భంగా రెండు వర్గాల మధ్య మొదలైన చిన్న వివాదం చినికి చినికి గాలివానగా మారింది. సాయంత్రం నుంచి మరుసటి రోజు తెల్లవారు జాము వరకు వివిధ ప్రదేశాల్లో విద్యార్థులు పరస్పరం కర్రలతో భౌతిక దాడులు చేసుకుంటూ రణరంగం సృష్టించారు. ఘటనకు సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది తీసిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ రణరంగంలో మొత్తం 36 మంది విద్యార్థులు పాల్గొన్నట్లుగా గుర్తించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. యూనివర్సిటీ పరంగానూ చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

టీజీఎస్‌పీడీసీఎల్‌కు 4 నాణ్యతా ధ్రువీకరణలు

గోవా డ్రగ్‌ పెడ్లర్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో వెయ్యిమంది తెలుగోళ్లు !

సింగరేణిని అవినీతి గనిగా మార్చారు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 06:08 AM