Share News

‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ సదస్సుకు ప్రత్యేక గీతం

ABN , Publish Date - Nov 26 , 2026 | 06:10 AM

డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు.

‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ సదస్సుకు ప్రత్యేక గీతం

  • కీరవాణి ఆధ్వర్యంలో 4 భాషల్లో సిద్ధం: సీఎస్‌

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ కోసం నాలుగు భాషల్లో ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఆధ్వర్యంలో ఈ గీతాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపై బుధవారం ఆయన సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.


డిసెంబరు 7న సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా, డిసెంబరు 9న నిర్వహించే క్లైమేట్‌ సమావేశం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని సీఎస్‌ చెప్పారు. సదస్సు ప్రాంగణంలో 45కు పైగా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాంస్కృతిక వేడుకల్లో పాల్గొనేందుకు హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్‌ వెస్లీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 06:10 AM