తెలంగాణలో ఉత్పత్తి, వ్యాపార విస్తరణ చేపట్టండి
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:43 AM
‘మీ ప్రధాన కార్యాలయం ముంబైలోనే కొనసాగించండి.. తయారీ, వ్యాపార విస్తరణ, అభివృద్ధి కార్యకలాపాలను తెలంగాణలో చేపట్టండ’ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముంబై పారిశ్రామికవేత్తలను కోరారు.
ముంబై పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం
‘మీ ప్రధాన కార్యాలయం ముంబైలోనే కొనసాగించండి.. తయారీ, వ్యాపార విస్తరణ, అభివృద్ధి కార్యకలాపాలను తెలంగాణలో చేపట్టండ’ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముంబై పారిశ్రామికవేత్తలను కోరారు. తయారీ, సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యాపార విస్తరణకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని కోరారు. ముంబైలోని వర్లీలో ఫోర్ సీజన్స్ హోటల్‌లో బుధవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సహకారంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ రోడ్ షోలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణలో ఉత్పత్తి, వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అనువైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. డిసెంబరులో నిర్వహించే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’లో పాల్గొనాలని ఆహ్వానించారు.
పెట్టుబడులకు వేగంగా అనుమతులు మంజూరు చేసే టీజీ-ఐపాస్ విధానాన్ని వివరించారు. ముంబై నుంచి తెలంగాణకు వచ్చే ప్రతి సంస్థకు ప్రత్యేక అధికారిని కేటాయిస్తామని చెప్పారు. పెట్టుబడులపై తొలి చర్చల నుంచి సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఆదాయం ఆర్జించే దశ వరకు ఆ అధికారి పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు ముంబైకి చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశమై పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
బాబా బర్త్‌డే స్పెషల్.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
Read Latest Telangana News And Telugu News