Share News

‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’కు పకడ్బందీ ఏర్పాట్లు : వివేక్‌

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:49 AM

అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ ప్రపంచ సదస్సును విజయవంతం చేయడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు.

‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’కు పకడ్బందీ ఏర్పాట్లు : వివేక్‌
G Vivek Venkataswamy

హైదరాబాద్‌, కందుకూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ ప్రపంచ సదస్సును విజయవంతం చేయడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సుకు వేదికైన ఫ్యూచర్‌ సిటీ పరిధి మీర్‌ఖాన్‌పేటలోని యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, ప్రతినిధులకు అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రముఖుల భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!

అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు

సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 06:49 AM