వారంలోనే ఇందిరమ్మ టవర్స్ ఇళ్ల పత్రాలిస్తాం
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:56 AM
ఇందిరమ్మ టవర్స్ (అల్పాదాయ వర్గాల) ఇళ్ల లక్కీడ్రాలో ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు.
బ్రోకర్లు, మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు: వీపీ గౌతమ్
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ టవర్స్ (అల్పాదాయ వర్గాల) ఇళ్ల లక్కీడ్రాలో ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు. లక్కీ డ్రాలో మొత్తం 7,340 మంది ఎంపిక కాగా.. ఇప్పటివరకు 6,643 మంది క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, వారిలో 5,521 మంది అర్హులుగా తేలినట్లు ఓ ప్రకటనలో వివరించారు. మిగిలిన అభ్యర్థుల పరిశీలనను కూడా త్వరగానే పూర్తి చేస్తామన్నారు.
లక్కీ డ్రాలో ఎంపికైన వారి అర్హత నిర్ధారణ, కేటాయింపు ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగే వారి సమాచారాన్ని హౌసింగ్ బోర్డు అధికారులకు లేదా పోలీసులకు తెలియజేయాలని కోరారు. అధికారిక సమాచారం కోసం ్టజజిఛ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ను లేదా 040-24603572 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని గౌతమ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రైవేటు భూమిపై ముదిరాజ్ నేతల కన్ను
ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పొన్నం కుటుంబం ఆదర్శం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News