కోటి కుటుంబాలకు రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Nov 17 , 2026 | 09:31 PM
తెలంగాణలో కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణలో కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ బీమా పథకాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ఇందిరమ్మ బీమాపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ప్రమాద బీమా ప్రయోజనాలు యథాతథంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే రూ.2 లక్షల జీవిత బీమాను రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడినీ తొలగించొద్దని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నవంబర్ 19వ తేదీన సిద్ధిపేట సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అదే సభలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో బీమా దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. చీరల పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు. బీమా, చీరల పంపిణీ అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్లో రూ.40 లక్షల హాషిష్ ఆయిల్ పట్టివేత.. ముగ్గురి అరెస్ట్
షర్మిలపై సాక్షి కథనాన్ని ఖండించిన నారా లోకేశ్.. మహిళను కించపరిచేలా ఉందని వ్యాఖ్య