Share News

హైదరాబాద్‌లో రూ.40 లక్షల హాషిష్ ఆయిల్ పట్టివేత.. ముగ్గురి అరెస్ట్

ABN , Publish Date - Nov 17 , 2026 | 08:49 PM

నాచారం పరిధిలో భారీగా హాషిష్ ఆయిల్‌ను ఉప్పల్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు.. ఉదయ్ దాస్, కల్యాణ్, మొహమ్మద్ సమీర్ బేగ్‌లను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో రూ.40 లక్షల హాషిష్ ఆయిల్ పట్టివేత.. ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్, నవంబర్ 17: నగరంలోని నాచారం పరిధిలో భారీగా హాషిష్ ఆయిల్‌ను ఉప్పల్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు.. ఉదయ్ దాస్, కల్యాణ్, మొహమ్మద్ సమీర్ బేగ్‌లను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల నుంచి 3.180 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు కాగా, మరొకరు ఫ్యాబ్రికేషన్ సూపర్‌వైజర్‌ అని చెప్పారు.


ఏపీ-ఒడిశా సరిహద్దు నుంచి ఈ హాషిష్ ఆయిల్ తీసుకొచ్చినట్లు నిందితులు తమ విచారణలో వెల్లడించారని పేర్కొన్నారు. ఈ ఆయిల్‌ను మైసమ్మగూడలోని కళాశాల విద్యార్థులకు విక్రయించేందుకు వారు ప్లాన్ వేశారన్నారు. వారి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, టీవీఎస్ జూపిటర్ స్కూటర్ కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అయితే ఈ హాషిష్ అయిల్ సరఫరా చేసిన వెంకట్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వివరించారు. ఉప్పల్ ఎస్‌ఓటీ, నాచారం పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

షర్మిలపై సాక్షి కథనాన్ని ఖండించిన నారా లోకేశ్.. మహిళను కించపరిచేలా ఉందని వ్యాఖ్య

ప్రపంచస్థాయి ప్రెసిషన్ ఇంజినీరింగ్ హబ్‌గా హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్ బాబు

Updated Date - Nov 17 , 2026 | 08:57 PM