Share News

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే అలాట్మెంట్ ఆర్డర్లు

ABN , Publish Date - Sep 20 , 2026 | 08:27 PM

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లబ్ధిదారులకు రేపటి నుంచి అలాట్మెంట్ ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే అలాట్మెంట్ ఆర్డర్లు
govt issuing indiramma illa allotment orders

హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లబ్ధిదారులకు రేపటి నుంచి అలాట్మెంట్ ఉత్తర్వులు జారీ చేయనుంది.


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన గృహాల కేటాయింపుల్లో.. లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారికి ప్రభుత్వం రేపటి నుంచి అలాట్‌మెంట్ ఉత్వర్వులు జరీ చేయనుంది. ఈ ఆర్డర్ లెటర్లను ఎంపికైన వారి మొబైల్ నెంబర్‌కు వాట్సాప్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా పంపుతారు. లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కూడా ఈ వివరాలు అందుబాటులో ఉండనున్నాయి.


శంకుస్థాపన చేయనున్న మంత్రి పొంగులేటి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాయదుర్గంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ నిర్మాణానికి రేపు(సోమవారం)శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీజీహెచ్‌బీ పరిధిలోని 2.85 ఎకరాల స్థలంలో ఈ టవర్స్‌ను నిర్మించనున్నారు. ఈ మేరకు మొత్తం 480 ప్లాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

గల్ఫ్ దేశాలలో వినాయక చవితి, నిమజ్జన వేడుకలు

సౌదీ అరేబియాలో వైభవంగా తెలుగు భాషా దినోత్సవం

Updated Date - Sep 20 , 2026 | 09:20 PM