ప్రతిష్ఠాత్మకంగా ఇండియా జాయ్
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:52 AM
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఇండియా జాయ్-2026ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది.
డిసెంబరు 7 నుంచి 13 వరకు నిర్వహణ
తెలుగు సినీ రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే సర్కారు లక్ష్యం
సినీ, యానిమేషన్ రంగాలకు చెందిన 200పైగా సంస్థలు పాల్గొనే అవకాశం
సినీ, సృజనాత్మక రంగాలకు ప్రోత్సాహం
ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్
ప్రభుత్వ కృషి అభినందనీయం: దిల్ రాజు
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా ఇండియా జాయ్-2026ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 7 నుంచి 13 వరకు నిర్వహించనున్న కార్యక్రమం ద్వారా తెలుగు సినిమా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇండియా జాయ్-2026 సన్నాహాలపై మంగళవారం సచివాలయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐటీ, ఎలక్ర్టానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ సినీపరిశ్రమ అభివృద్ధికి హైదరాబాద్‌లో అపార అవకాశాలున్నాయని తెలిపారు.
ఇండియా జాయ్ నిర్వహణ ప్రణాళికలు, ఏవీజీసీ పాలసీ, ఇమేజ్ టవర్స్ అభివృద్ధి, సృజనాత్మక రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం తదితర అంశాలను ఆయన వివరించారు. తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇండియా జాయ్‌ను విజయవంతం చేసేందుకు సినీ పరిశ్రమ తరఫున కృషి చేస్తామన్నారు. ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ సినీ, సృజనాత్మక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను స్వాగ తిస్తున్నామన్నారు.
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కల్యాణ్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఉపాధ్యక్షుడు మాదాల రవి తదితరులు ఇండియాజాయ్ నిర్వహణకు మద్దతు తెలిపారు. హైదరాబాద్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ రంగాల అభివృద్ధికి ఉన్న అవకాశాలను సనత్(ఫైర్‌ఫ్లై), బాసిరెడ్డి సునీల్(ఫాంటమ్) వివరించారు. ఇండియాజాయ్-2026ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని గ్లోబల్ సమ్మిట్ వ్యూహాత్మక సలహాదారు అచల్ మల్హోత్రా తెలిపారు.
15కుపైగా ప్రత్యేక కార్యక్రమాలు
ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఇండియాజాయ్‌లో సినిమాలు, ఏవీజీసీ-ఎక్స్‌ఆర్, గేమింగ్, సంగీత కచేరీలు, ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికగా నిర్వహించనున్న కార్యక్రమానికి లక్ష మందిపైగా సందర్శకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ, సోనీ, అడోబ్, డీఎన్‌ఈజీ, ఈఏ స్పోర్ట్స్, యూబీ సాఫ్ట్, అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్‌సిటీతోపాటు 200పైగా సంస్థలు పాల్గొననున్నాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ఓటీటీ వేదికల ప్రతినిధులు, అంతర్జాతీయ స్టూడియోలకు చెందిన 100మందిపైగా పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు హాజరయ్యే అవకాశం ఉంది. వీఎ్‌ఫఎక్స్ సమ్మిట్, కామిక్ కాన్, ఇండీ గేమ్ ఉత్సవ్, ఓటీటీ పల్స్, ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్, ఇండియన్ ఫిల్మ్ కాన్‌క్లేవ్, హైదరాబాద్ ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ (హెచ్‌ఏఐఎఫ్ఎఫ్) సహా 15కుపైగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబరు 8న రెడ్‌కార్పెట్ కార్యక్రమం, 9న ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీత కచేరీ ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై
రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
Read Latest AP News And Telangana News