‘షీ టీమ్స్’ పేరిట మాజీ ప్రియుడికి నకిలీ నోటీసు
ABN , Publish Date - Nov 19 , 2026 | 07:05 AM
కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన తిరునేశ్వర్కు గతంలో ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడిచింది.
ఖైరతాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన తిరునేశ్వర్కు గతంలో ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడిచింది. మొదట పెళ్లి చేసుకోవాలని భావించినా, ఏడాది కాలంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. కొద్దిరోజు లుగా తిరునేశ్వర్ ఆమె ఫోన్ నెంబరుతో పాటు సోష ల్ మీడియా ఖాతాలను సైతం బ్లాక్ చేయడంతో యువతి కక్ష పెంచుకుంది.
ఈ క్రమంలో ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ సాయంతో నకిలీ నోటీసు తయారు చేసి, ఈనెల 17న షీటీమ్స్ కార్యాలయానికి హాజరు కావాలని అందులో పేర్కొంది. అది అసలైన నోటీసుగా భావించిన తిరునేశ్వర్ కార్యాలయానికి వెళ్లగా.. తమ అధికారిక నమూనాకు భిన్నంగా ఉండటంతో అది నకిలీదని సిబ్బంది గుర్తించారు. షీ టీమ్స్ ఎస్సై వెంక టేష్ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు యువ తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్ఎస్ నేతల్లో ఆధిపత్య పోరు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News