హైదరాబాద్ వాటర్ బోర్డు ఉద్యోగుల సమ్మెపై నిషేధాన్ని పొడిగించిన ప్రభుత్వం
ABN , Publish Date - Oct 22 , 2026 | 06:25 PM
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ వాటర్ వర్క్‌లో ఉద్యోగుల సమ్మెపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగించింది. మరో ఆరు నెలల పాటు నిషేధం విధించింది.
హైదరాబాద్, అక్టోబర్ 22: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ వాటర్ వర్క్‌లో ఉద్యోగుల సమ్మెపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగించింది. మరో ఆరు నెలల పాటు సమ్మెపై నిషేధాన్ని విధించింది. గురువారం ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీవో నంబర్ 955ను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ జారీ చేశారు.
ఈ ఆదేశాలను అమలు చేయాలని హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీకి స్పష్టం చేశారు. అక్టోబర్ 21వ తేదీ నుంచి ఈ సమ్మెపై నిషేధం అమల్లోకి వచ్చిందని ఆ జీవోలో స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు. నీటి సరఫరా, పంపిణీ సేవల్లో సమ్మెలకు అనుమతి లేదని జారీ చేసిన జీవోలో వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ మంత్రి కాకాణికి షాక్.. టీడీపీలోకి భారీగా చేరికలు
ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
For More TG News And Telugu News