Share News

డెడ్‌లైన్‌ 99 రోజులు..

ABN , Publish Date - Mar 07 , 2026 | 08:40 AM

వాటర్‌బోర్డు ప్రతీ కార్యాలయంలో ఈ-ఆఫీస్‌ వ్యవస్థ, డిజిటల్‌ గవర్నెన్స్‌ అమలు చేయాలని, ప్రస్తుతం ఉన్న ఫైళ్లను 99 రోజుల్లో డిజిటల్‌ రూపంలోకి మార్చాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశించారు.

డెడ్‌లైన్‌ 99 రోజులు..

  • ఫైళ్లన్నీ డిజిటల్‌గా మారాలి: వాటర్‌బోర్డు ఎండీ

హైదరాబాద్‌ సిటీ: వాటర్‌బోర్డు ప్రతీ కార్యాలయంలో ఈ-ఆఫీస్‌ వ్యవస్థ, డిజిటల్‌ గవర్నెన్స్‌ అమలు చేయాలని, ప్రస్తుతం ఉన్న ఫైళ్లను 99 రోజుల్లో డిజిటల్‌ రూపంలోకి మార్చాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి(Water Board MD Ashok Reddy) ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు కార్యాచరణను వాటర్‌బోర్డు అన్ని కార్యాలయాలలో నిర్వహించాలని సూచించారు.


జేఎండీ మయాంక్‌ మిట్టల్‌తో కలిసి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాటర్‌బోర్డు ప్రధాన కార్యాయలయంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఈడీపీ, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీస్‌ వద్ద ఫైల్‌ డిస్పోసల్‌ను పరిశీలించిన ఎండీ పేరుకుపోయిన పాత ఫైళ్లను తొలగించి కార్యాలయాన్ని పరిశ్రుభంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. అవసరమైన ఫైళ్లను భద్రపరచాలని, డాక్యుమెంట్లను స్కాన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.


city4.2.jpgమూసేసిన ఫైళ్లను సూచిక (ఇండెక్స్‌) ప్రకారం క్రమబద్ధీకరించి రికార్డు గదిలో భద్రపరచాలని చెప్పారు. ప్రతీ ఫైలు ఇకపై ఈ-ఆఫీస్‌ ద్వారా రావాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతీరోజు, ప్రతీ వార్డులో కనీసం 500 రన్నింగ్‌ మీటర్లు సీవర్‌ లైన్లను డీసిల్టింగ్‌ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టీవీ శ్రీధర్‌, మహమ్మద్‌ అబ్దుల్‌ ఖాదర్‌, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు

బెంచీలు కొన్నారు.. పిల్లలు నేలపైనే కూర్చున్నారు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 07 , 2026 | 08:40 AM