Share News

తండ్రి ఫోన్ వాడొద్దన్నందుకు ఆగ్రహించిన బాలిక.. రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:40 AM

ఫోన్ వాడుతుందని తండ్రి మందలించడంతో.. మనస్తాపం చెందిన ఓ బాలిక కఠిన నిర్ణయం తీసుకుంది. ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ వద్ద గూడ్స్‌ రైలుకు ఎదురుగా వెళ్లి ప్రాణాలు తీసుకుంది.

తండ్రి ఫోన్ వాడొద్దన్నందుకు ఆగ్రహించిన బాలిక.. రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య
Hyderabad Incident

హైదరాబాద్, ఆగస్టు 27: తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఓ బాలిక కఠిన నిర్ణయం తీసుకుంది. ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ వద్ద గూడ్స్‌ రైలుకు ఎదురుగా వెళ్లి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన ఓ బాలిక అస్తమానం ఫోన్‌లో గడిపేది. ఇది గమనించిన తండ్రి.. పలుమార్లు ఆమెను మందలించాడు.


దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక.. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత నేడు(గురువారం) ఉదయం ఉప్పుగూడ రైల్వేస్టేషన్ సమీపంలో శవమై తేలింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే బాలిక వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర విచారం

విశాఖలో లారీ డ్రైవర్‌పై దాడి ఘటన.. నిందితుడి అరెస్ట్

Updated Date - Aug 27 , 2026 | 11:44 AM