Share News

నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం.. క్రిమినల్ కేసులు నమోదు

ABN , Publish Date - Jul 31 , 2026 | 03:58 PM

నగరంలో వాహనాల నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత వారం రోజులుగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం.. క్రిమినల్ కేసులు నమోదు
Hyderabad Traffic police

హైదరాబాద్‌, జులై 31: నగరంలో వాహనాల నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత వారం రోజులుగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ నంబర్ ప్లేట్లు వినియోగిస్తున్న ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సుల్తాన్‌బజార్, మెహదీపట్నం, బహదూర్‌పురాతోపాటు పెద్దపల్లి, మేడిపల్లి, కట్టంగూర్ ప్రాంతాల్లో ఈ కేసులు నమోదు చేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.


ప్రభుత్వం ఆమోదించిన హెచ్‌ఎస్ఆర్‌పీ (HSRP) నంబర్ ప్లేట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. HSRP కాకుండా ఇతర నంబర్ ప్లేట్లు వాడితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు. నంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు, డిజైన్లుతోపాటు అంకెల మార్చడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.


నకిలీ నంబర్ ప్లేట్లు వాడితే వాహనం సీజ్‌తో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. చలానాల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది వాహనదారులు నంబర్ ప్లేట్లు మారుస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో 'జీరో టాలరెన్స్' విధానంతో ముందుకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మార్కెట్‌లో నకిలీ ఎరువులు విక్రయాలు.. రైతులకు వ్యవసాయ శాఖ బిగ్ అలర్ట్

పార్లమెంట్ ప్రాంగణంలో హుండీ పెట్టిన ఎంపీలు.. రాహుల్ గాంధీ ఏం చేశారంటే..?

Read Latest TG News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 04:54 PM