Share News

వాహనదారులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

ABN , Publish Date - Feb 28 , 2026 | 10:12 AM

హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ కూడళ్ల వద్ద ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వివరాల్లోకి వెళితే..

వాహనదారులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Traffic Alert

హైదరాబాద్, ఫిబ్రవరి 28: నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ కూడళ్ల వద్ద ట్రాఫిక్ కష్టాల(Hyderabad Traffic)కు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అడుగులు వేస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాసుల నిర్మాణ పనులకు శుక్రవారం ముగ్ధా జంక్షన్ వద్ద భూమి పూజ నిర్వహించారు. ఈ భారీ నిర్మాణ పనుల నేపథ్యంలో ఇవాళ్టి (శనివారం) నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) అమలులోకి వచ్చాయి. ఇప్పటికే వాహనదారులకు పలు సూచనలు చేశారు ట్రాఫిక్ పోలీసులు.


ముఖ్యమైన ట్రాఫిక్ మళ్లింపులు ఇవే:

భారీ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్న సమయంలో సామాన్య ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేశారు. ముఖ్యంగా సాగర్ సొసైటీ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ (గేట్-1), ముగ్ధా జంక్షన్ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.

  • బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లేవారు.. రోడ్ నెం.10 క్యాన్సర్ హాస్పిటల్ అగ్రసేన్ ఐలాండ్ భారతీయ విద్యా భవన్ మీదుగా వెళ్లాలి.

  • మాసబ్ ట్యాంక్ నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లేవారు విరించి హాస్పిటల్ రోడ్ 12 జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ ద్వారా వెళ్లాలి.

  • NFCL నుంచి శ్రీనగర్ కాలనీ, సాగర్ సొసైటీ, ఇందిరానగర్, లేబర్ అడ్డా మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు వెళ్లాలి.

  • జూబ్లీహిల్స్ రోడ్ నెం 36/45 నుంచి NFCL వైపు వెళ్లే వాహనాలు ఇందిరానగర్, శ్రీరామ్ నగర్ కాలనీ మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

నిర్మాణ పనుల కారణంగా ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. రద్దీ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘రైతు భరోసా’పై మోసగించిన కాంగ్రెస్‌

కవిత విషయంలో తప్పు చేశామా?

Read Latest Telangana News and National News

Updated Date - Feb 28 , 2026 | 01:41 PM