సత్వర విద్యుత్ సేవలకు వాట్సాప్ చాట్: సీఎండీ ముషారఫ్ ఫారూఖీ
ABN , Publish Date - Feb 23 , 2026 | 10:36 AM
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్ర జ్యోతి): దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్ సేవలను నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారానే పొందేలా వాట్సాప్ చాట్ సేవలను ప్రారంభించినట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ వాట్సాప్‌లో 8712441912 నంబర్‌ను సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా ఫిర్యాదుల నమోదు, బిల్లింగ్ వివరాలు, విద్యుత్ సరఫరా స్థితి, సమాచారం వంటి వివిధ సేవలను సులభంగా పొందవచ్చని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు పంపించే మెసేజ్‌లకు వాట్సాప్ చాట్‌బాట్ చెక్ పెడుతుందన్నారు సీఎండీ. విద్యుత్ సరఫరాలో ఫిర్యాదుల నమోదుతో పాటు బిల్లు జారీచేయకపోయినా, ఆన్‌లైన్ బిల్లు చెల్లించాక ఆ సమాచారం అప్డేట్ కాకపోయినా, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏవైనా సమస్యలు తలెత్తినా, విద్యుత్ లైన్లకు చెట్లకొమ్మలు తగిలినా, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నా.. ఇలా పలురకాల ఫిర్యాదులను వాట్సాప్ చాట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల క్యూ లైన్‌లో భక్తురాలిని కాటేసిన పాము.. ఆసుపత్రికి తరలింపు
రిటైర్మెంట్ వరకూ సస్పెన్షన్‌లోనే!
For More TG News And Telugu News