టీ-స్క్వేర్‌కు కార్యరూపం ఎప్పుడు?
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:15 AM
న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి కూడలి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు.
గత ఏడాదే పనులు ప్రారంభం కావాలన్న సీఎం
కానీ ఈ ఏడాది జూన్‌లో టెండర్లు పిలిచిన టీజీఐఐసీ
హైదరాబాద్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి కూడలి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో టీ స్క్వేర్ నిర్మాణ పనులను గత ఏడాది నవంబరు నుంచే మొదలుపెట్టాలని గతంలో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఇప్పటివరకు పురోగతి లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌కు మరో ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రజలు రోజంతా సందర్శించేలా, వినోద కార్యక్రమాలు నిర్వహించుకునేలా, అంతర్జాతీయ స్థాయి వసతులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు.
ఐటీ సంస్థలు, వ్యాపార కార్యకలాపాలకు మరింత ఊతమివ్వడంతో పాటు నగరానికి కొత్త పర్యాటక కేంద్రాన్ని అందించాలనేది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)కి అప్పగించారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదనేది ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్టు డిజైన్లు, తదుపరి కార్యాచరణ, నిర్మాణ షెడ్యూల్ వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి కీలక ప్రాజెక్టు విషయంలో వేగంగా ముందుకుసాగాల్సి ఉండగా, టీజీఐఐసీ ఈ ఏడాది జూన్‌లో ఆర్కిటెక్చరల్ కన్సల్టెంట్ కోసం టెండర్లు పిలవడంతో పురోగతి తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International