Share News

ఎన్యూమరేషన్ ఫామ్‌లు త్వరగా బీఎల్‌వోలకు ఇవ్వాలి: ప్రజలకు ఆర్వీ కర్ణన్ సూచన

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:16 PM

రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పొడిగింపు మళ్లీ ఉండదని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఎన్యూమరేషన్ ఫామ్‌లు త్వరగా బీఎల్‌వోలకు ఇవ్వాలని నగరంలోని ఓటర్లకు సూచించారు.

ఎన్యూమరేషన్ ఫామ్‌లు త్వరగా బీఎల్‌వోలకు ఇవ్వాలి: ప్రజలకు ఆర్వీ కర్ణన్ సూచన
GHMC Commisioner RV Karnan

హైదరాబాద్, జులై 21: రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పొడిగింపు మళ్లీ ఉండదని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫామ్‌లు త్వరగా బీఎల్‌వోలకు ఇవ్వాలని నగరంలోని ఓటర్లకు సూచించారు. ఫామ్ తీసుకున్న ఓటర్లు ఆగస్టు 3వ తేదీ వరకు గడువు ఉందని చెబుతున్నారని.. కానీ వీటినన్నింటిని డిజిటలైజేషన్ చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సర్ ఫామ్‌లు సాధ్యమైనంత త్వరగా బీఎల్‌వోలకు అందించాలని ప్రజలకు ఆయన వివరించారు.


చివరి రోజు వరకు ఆగితే.. డిజిటలైజేషన్ చేసే సమయంలో సర్వర్ డౌన్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. పలు ప్రాంతాల్లో బీఎల్‌వోలు ఐదారుసార్లు ఇంటింటికి వెళ్లారని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో 9.59 శాతం మంది ఓటర్లు ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫామ్‌లు నింపారని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 43 శాతం ఎన్యూమరేషన్ ఫామ్‌లు రిసీవ్ చేసుకుని.. వాటి వివరాలను డిజిటలైజ్ చేశామని పేర్కొన్నారు.


ఓటరును భయపెట్టి, ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు. ఓటు హక్కుకు, సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరించారు. మీ ఓటు హైదరాబాద్‌లో ఉన్నా లేక గ్రామాల్లో ఉన్నా సంక్షేమ పథకాలు ఎక్కడికి పోవని అన్నారు. SIR ప్రక్రియలో నిర్లక్ష్యంగా వహించిన ఓ AEROను ఇప్పటికే సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. ఇంకొంత మంది బీఎల్‌వోలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. బీఎల్‌వోలు ఎలా పని చేస్తున్నారో చెక్ చేయడానికి విజిలెన్స్ అధికారులు ఫీల్డ్‌లో చెక్ చేస్తున్నారని ఆర్వీ కర్ణన్ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న హరీశ్ రావు: మంత్రి ఉత్తమ్

ఎల్ నినో సవాళ్లకు తెలంగాణ సర్కార్ పక్కా ప్రణాళిక: డిప్యూటీ సీఎం భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2026 | 06:28 PM