Share News

పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న హరీశ్ రావు: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:13 PM

ఈ ప్రభుత్వంలో సన్న వడ్ల కుంభకోణం అనేది అవాస్తవమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై మీడియా - సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. కొందరు కావాలని సన్న వడ్ల కుంభకోణం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న హరీశ్ రావు: మంత్రి ఉత్తమ్
TG Minister Uttam kumar reddy

హైదరాబాద్, జులై 21: ఈ ప్రభుత్వంలో సన్న వడ్ల కుంభకోణం అనేది అవాస్తవమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై మీడియా - సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. కొందరు కావాలని సన్న వడ్ల కుంభకోణం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఈ కుంభకోణం జరిగి ఉండవచ్చని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పని పారదర్శకంగా జరుగుతుందని వివరించారు. ధరలు పెంచి టెండర్ కోడ్ చేస్తే.. ఎవ్వరూ ముందుకు రాలేదని అన్నారు. అందుకే మళ్ళీ పిలిచారని తెలిపారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదలలో ఎక్స్‌పర్ట్ అయితే.. హరీశ్ రావును మంత్రి పదవి నుంచి కేసీఆర్ ఎందుకు తొలగించారంటూ ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ముందు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ హరీశ్ రావుకు సూచించారు. దేవాదులలో 7 పంపులు నడుస్తున్నాయని.. నేడు మరో రెండు అందుబాటులోకి వస్తాయని అన్నారు. రూ.14 వందల కోట్ల సంగతి ఏమిటో ముందు సమాధానం చెప్పాలంటూ హరీశ్ రావును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - Jul 21 , 2026 | 06:17 PM