Share News

సంపన్న బాలికలే టార్గెట్.. కీలక నిందితుడు అరెస్టు..

ABN , Publish Date - Apr 19 , 2026 | 08:29 PM

సంపన్నుల పిల్లలే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు అర్జున్‌ను జూబ్లీహిల్స్ షీ టీమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

సంపన్న బాలికలే టార్గెట్.. కీలక నిందితుడు అరెస్టు..
Hyderabad Police

హైదరాబాద్: సంపన్నుల పిల్లలే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు అర్జున్‌ను జూబ్లీహిల్స్ షీ టీమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ముఠా ప్రధానంగా ధనిక కుటుంబాలకు చెందిన బాలికలను లక్ష్యంగా చేసుకుంది. విదేశాల్లో ఉన్న తల్లిదండ్రుల పిల్లలను గుర్తించి సోషల్ మీడియా మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్నేహం పెంచుకుంటున్నారు.


ఆపై వారిని తమ వలలోకి దింపుతున్నారు. అలాగే నగరంలోని పలు పబ్బుల్లో తిరుగుతూ డబ్బున్న బాలికలను పరిచయం చేసుకుంటారు. ఆపై వారికి దగ్గరవుతారు. బాలికలతో సన్నిహితంగా ఫొటోలు, వీడియోలు దిగుతారు. అనంతరం వాటి ఆధారంగా బెదిరింపులకు దిగి నగదు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈ ముఠాలోని మరికొంతమందిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీస్ ఆక్టోపస్‌ ఆపరేషన్‌

Updated Date - Apr 19 , 2026 | 08:38 PM