Share News

ఔషధాల ముసుగులో మత్తుదందా!

ABN , Publish Date - Oct 08 , 2026 | 06:24 AM

హైదరాబాద్‌లోని పలు మెడికల్‌ షాపుల్లో డాక్టర్‌ చీటీ లేకుండా మత్తుమందులను విక్రయిస్తున్నారని కేంద్ర నిఘావర్గాల నుంచి అందిన సమాచారం మేరకు... ఈగల్‌, టీజీ సేఫ్‌ సంయుక్త బృందాలు బుధవారం పలు మందుల దుకాణాల్లో సోదాలు నిర్వహించాయి.

ఔషధాల ముసుగులో మత్తుదందా!
Medical shops inspections

  • డాక్టర్‌ చీటీ లేకుండానే మత్తుమందుల అమ్మకాలు

  • పలు మెడికల్‌ షాపుల్లో ఈగల్‌ ఫోర్స్‌సోదాలు

  • నాలుగింటికి షోకాజ్‌ నోటీసులు

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని పలు మెడికల్‌ షాపుల్లో డాక్టర్‌ చీటీ లేకుండా మత్తుమందులను విక్రయిస్తున్నారని కేంద్ర నిఘావర్గాల నుంచి అందిన సమాచారం మేరకు... ఈగల్‌, టీజీ సేఫ్‌ సంయుక్త బృందాలు బుధవారం పలు మందుల దుకాణాల్లో సోదాలు నిర్వహించాయి. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా గుర్తించిన నాలుగు షాపులకు అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మాసాబ్‌ట్యాంక్‌లోని అల్‌ హమ్రా మెడికల్‌ షాపులో షెడ్యూల్‌ రిజిస్టర్‌ నిర్వహించక పోవడం, కొన్ని మత్తుమందుల అమ్మకాలకు విక్రయ బిల్లులు లేకపోవడం టోసెక్స్‌ సిరప్‌, ఉస్టాపిన్‌, టాపెంటాడాల్‌, అల్ర్పాజోలం, ట్రామ్డెక్స్‌, అల్ర్పాక్స్‌ మందుల రికార్డుల్లో అవకతవకలను గుర్తించారు.


ఇదే క్రమంలో మల్లేపల్లిలోని ఎంఎం మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్‌ లో ప్రెగాలైవ్‌75 కు సంబంధించిన విక్రయబిల్లులతో పాటు షెడ్యూల్‌ హెచ్‌1 డ్రగ్స్‌ రిజిస్టర్‌, సేల్‌ బుక్‌ అందుబాటులో లేవు. టోలిచౌకిలోని ఫస్ట్‌ స్టెప్‌ డ్రగ్‌ మార్ట్‌లో నిర్వహించిన అకస్మిక తనిఖీల్లో ఫార్మాసిస్ట్‌ అందుబాటులో లేకపోవడం, కొనుగోలు, విక్రయాల బిల్లుల్లో లోపాలు గమనించారు. టోలిచౌకిలోని హయత్‌ ఫార్మసీలో ప్రిస్ర్కిప్షన్‌ రిజిస్టర్‌ లేకపోవడం, ప్రెగాసి్‌ప-ఎం, రెస్టెల్‌ 0.5ఎంజీ, అలా్ట్రపెట్‌ తదితర మత్తుమందులకు అమ్మకాల బిల్లులు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ దుకాణాలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వైద్యుల చీటీ లేకుండా అమ్మడంతో మందుల దుర్వినియోగం జరుగుతుందని, దీనిని మత్తుమందులకు అలవాటు పడిన వారు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారని ఈగల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. మెడికల్‌ షాపుల నిర్వాహకులు ఇలాంటి మత్తు కలిగించే మందులను డాక్టర్‌ చీటీ లేకుండా అమ్మకూడదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...
మ్యూల్‌ ఖాతాలిచ్చే వారిలో చదువుకున్నోళ్లే ఎక్కువ

అబద్ధాలను పోగేసి బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం

ట్రైబ్యునల్‌ తేల్చితేనే పాలమూరు-రంగారెడ్డి!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 06:24 AM