Share News

డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. భారీగా మెఫెడ్రోన్ స్వాధీనం

ABN , Publish Date - Jun 15 , 2026 | 06:20 PM

హైదరాబాద్‌లోని అబ్దుల్లా పూర్‌మెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును ఈగల్ టీం రట్టు చేసింది.

డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. భారీగా మెఫెడ్రోన్ స్వాధీనం

హైదరాబాద్, జూన్15: నగర శివారులోని అబ్దుల్లా పూర్‌మెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టును ఈగల్ టీం రట్టు చేసింది. సోమవారం డ్రగ్స్ తయారు చేస్తున్న నరేష్, మత్స్యగిరిలను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. ఈ ముఠాలో సంతోష్ సింగ్ అలియాస్ రాజు అలియాస్ రాజేష్, విజయ్, అశ్విని పాఠక్ కీలక సభ్యులుగా ఉన్నారని ఈగల్ టీం తెలిపింది. అలాగే రూ.50 లక్షల విలువైన మెఫెడ్రోన్‌తోపాటు రసాయనాలను స్వాధీనం చేసుకుంది. రూ.50 లక్షల విలువైన ఆ ఫ్యాక్టరీని సీజ్ చేసింది.


నరేష్, కీసర మత్స్యగిరిలు గత కొన్ని సంవత్సరాలుగా తప్పించుకుని తిరుగుతున్నారని ఈగల్ టీం వెల్లడించింది. రసాయన శాస్త్రవేత్త నుంచి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యులుగా వీరు ఎదిగారని తెలిపింది. గతంలో వీరు హత్యలు, దోపిడీలతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని వివరించింది. చివరకు వీరు డ్రగ్స్ తయారీదారులుగా మారారని తెలిపింది.


అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌లో ఈ ముఠా కీలకంగా వ్యవహరిస్తుందని వెల్లడించింది. గత ఆరు నెలలుగా వీరి కోసం గాలిస్తున్నామని చెప్పింది. 2015 నుంచి దేశవ్యాప్తంగా అక్రమ డ్రగ్స్ తయారీ కేంద్రాలను ఈ ముఠా ఏర్పాటు చేసి.. తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఈగల్ టీం వివరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

గోల్కొండలో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 15 , 2026 | 06:28 PM