మణికొండలో పేలిన మంజీరా పైప్ లైన్.. అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి చేరిన నీరు
ABN , Publish Date - Feb 17 , 2026 | 09:31 AM
మణికొండలో మంజీరా పైప్ లైన్ మంగళవారం తెల్లవారుజామున పేలింది. దాంతో మంచి నీరు రహదారిపైకి భారీగా వచ్చి చేరింది. ఈ పైప్ లైన్ ధాటికి సీసీ రోడ్డు పగిలిపోయింది.
హైదరాబాద్, ఫిబ్రవరి17: మణికొండలో మంజీరా పైప్ లైన్ మంగళవారం తెల్లవారుజామున పేలింది. దాంతో మంచి నీరు రహదారిపైకి భారీగా వచ్చి చేరింది. ఈ పైప్ లైన్ ధాటికి సీసీ రోడ్డు పగిలిపోయింది. ఆ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి భారీగా మంచి నీరు వచ్చి చేరింది. సెల్లార్లలో నిలిపిన వాహనాలన్నీ నీట మునిగాయి. స్థానికులు వెంటనే స్పందించి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బందితోపాటు మెట్రో వాటర్ వర్క్స్ సిబ్బంది.. ఈ ప్రాంతానికి వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అపార్ట్‌మెంట్ సెల్లార్లలో నిండిన నీటిని భారీ మోటార్ల సహాయంతో సిబ్బంది బయటకు పంపుతున్నారు. దాదాపు రెండు గంటలకుపైగా ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో వైపు.. ఆ ప్రాంతాలో మంచి నీటి సరఫరాను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఉన్నతాధికారులు.. ఈ ప్రాంతంలో పర్యటించిన పరిస్థితిని సమీక్షించారు. పైప్ లైన్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ
For TG News And Telugu News