విషాదం.. లిఫ్ట్‌లో చిక్కుకుని చిన్నారి మృతి
ABN , Publish Date - May 13 , 2026 | 09:44 PM
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతిచెందింది. ఓ మహిళా హాస్టల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్, మే11: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతిచెందింది. ఓ మహిళా హాస్టల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరణించిన చిన్నారిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్తు ఘోష్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన ప్రకారం..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే గౌలిదొడ్డిలో మహిళా హాస్టల్‌లో వంట పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వారికి ఐదేళ్ల చిన్నారి బిస్తు ఘోష్ ఉంది. ఇవాళ(బుధవారం) మధ్యాహ్నం గ్రిల్ లిఫ్ట్‌లో అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5వ ఫ్లోర్‌కు బాలిక వెళ్లింది. ఈ క్రమంలో 3వ ఫ్లోర్‌లో చిన్నారి జుట్టు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది.
తలకు తీవ్ర గాయం కావడంతో బిస్తు ఘోష్ మృతిచెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. హైడ్రా, ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీఎం రేవంత్‌రెడ్డితో ఉబర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ
ఆ విద్యార్థులకు పవన్ కల్యాణ్ భరోసా.. ఉచిత విద్యకు ముందుకొచ్చిన విద్యాసంస్థలు