Share News

ప్రధాని అయినా, కేంద్ర మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే: మంత్రి సీతక్క..

ABN , Publish Date - May 13 , 2026 | 08:06 PM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసు వివాదంపై మంత్రి సీతక్క స్పందించారు. కేంద్ర మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని అన్నారు.

ప్రధాని అయినా, కేంద్ర మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే: మంత్రి సీతక్క..
Minister Seethakka

మహబూబాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసు వివాదంపై మంత్రి సీతక్క స్పందించారు. కేంద్ర మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని అన్నారు. భగీరథ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా తాత్సారం చేయలేదని సీతక్క స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోక్సో కేసు నమోదు చేశామని వెల్లడించారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కారణంగా కేసు నమోదు చేయడంలో ఒక్క రోజు ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని మంత్రి సీతక్క ఒప్పుకున్నారు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయడం కాలయాపన కోసం కాదని, నిజానిజాలు వెలికితీయడానికేనని పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎంతటి వారైనా పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు మహిళలను గౌరవించాలని, ప్రజలను ప్రేమించాలని ఈ సందర్భంగా సీతక్క విజ్ఞప్తి చేశారు.


బాలికపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి భగీరథ్ పరారీలో ఉన్నట్లు సమాచారం. బుధవారం పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ నెల 15వ తేదీన విచారణకు హాజరవుతానని పేర్కొంటూ పేట్ బషీరాబాద్ పోలీసులకు, సిట్ అధికారులకు ఈ-మెయిల్‌తో పాటు భగీరథ్ ఓ లేఖ పంపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

సీఎం రేవంత్‌రెడ్డితో ఉబర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ

ఆ విద్యార్థులకు పవన్ కల్యాణ్ భరోసా.. ఉచిత విద్యకు ముందుకొచ్చిన విద్యాసంస్థలు

Updated Date - May 13 , 2026 | 08:20 PM